
ఈనాడు, హైదరాబాద్‌: తనకు ఎంత భూమి ఉందనే వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లోనే వెల్లడించానని, అందులో చెప్పిన దాని కంటే గజం ఎక్కువున్నా.. ప్రభుత్వానికే సరెండర్‌ చేస్తానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. అసెంబ్లీలో 22ఏపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టుగా చేసిన వ్యాఖ్యలపై బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా కవిత స్పందించారు. ‘‘సీఎం అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు చెప్పారో.. వారందరిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం నాకు లేదు. సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే.. సీబీఐ విచారణ జరిపించాలి. నిబంధనలు అతిక్రమించి నాకు ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్టు తేలినా.. ఆ భూములు సర్కారుకే ఇచ్చేస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నా’’ అని కవిత పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





