
‘జబర్దస్త్’ ద్వారా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకడు. పేరుకు తగ్గట్టుగానే తన గెటప్పులతోనే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు శీను. సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లతో కలిసి ఇతను చేసిన కామెడీ స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్వా నవ్వించాయి. యూట్యూబ్ లోనూ వీరి కామెడీ స్కిట్స్ కు భారీగా వ్యూస్ వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంది గెటప్ శీను గెటప్పుల కోసమే ‘జబర్దస్త్’ ని చూసే వారంటే అతి శయోక్తి కాదు. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు సైతం గెటప్ శీను కామెడీకి ఫిదా అయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు అతనికి ఉన్న ట్యాలెంట్ ఏంటో. కాగా సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు దూరమైపోయాడు గెటప్ శీను. అయితే అప్పుడప్పుడు గెస్టుగా వచ్చి ఆడియెన్స్ ను నవ్విస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న కమెడియన్లలో గెటప్ శ్రీను కూడా ఒకడు. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు అఖిల్ అక్కినేని వంటి యంగ్ హీరోలతోనూ కామెడీ చేస్తున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఈ ఒక్క ఏడాది లోనే దాదాపు 8 సినిమాల్లో నటించాడంటే గెటప్ శ్రీనుకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, రాకాస, రీసెంట్ గా లెనిన్ సినిమాల్లో గెటప్ శ్రీను నటనకు మంచి మార్కులు పడ్డాయి.



