
బట్టలు ఉతికిన తర్వాత కూడా కొన్నిసార్లు చెమట వాసన, తేమ వాసన అలాగే ఉంటుందా? ముఖ్యంగా తువ్వాళ్లు, జిమ్ దుస్తులు, బెడ్షీట్లు వంటి వాటిని ఎన్ని సార్లు ఉతికినా ఫ్రెష్‌గా అనిపించకపోవచ్చు. దీంతో డిటర్జెంట్‌తో పాటు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ వంటి వాటిని ఉపయోగిస్తుంటాం. అయితే వీటితో పాటు వంటగదిలో సాధారణంగా ఉండే వైట్ వెనిగర్‌ను వాషింగ్ మెషీన్లో ఉపయోగించే చిట్కా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.వెనిగర్‌లోని కొంత ఎసిడిక్ గుణం దుస్తులపై మిగిలే డిటర్జెంట్ అవశేషాలను తగ్గించడంతో పాటు, కొన్ని రకాల వాసనలను తొలగిస్తుందని AEM అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా దుస్తులు ఉతికిన తర్వాత గట్టిగా అనిపించడం, తేమ వాసన రావడం వంటి సమస్యలు ఉన్నప్పుడు కొందరు దీన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. మరి వాషింగ్ మెషీన్లో వెనిగర్‌ను ఎందుకు ఉపయోగిస్తారు? ఏ దుస్తులకు సరిపోతుంది? ఉపయోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..దుస్తుల దుర్వాసన తగ్గుతుందితువ్వాళ్లు, జిమ్ దుస్తులు, ఎక్కువసేపు తడిగా ఉండే బట్టల్లో కొన్నిసార్లు చెమట, తేమ వాసన వస్తుంది. వైట్ వెనిగర్‌లోని ఎసిడిక్ గుణాలు కొన్ని వాసనలకు కారణమయ్యే అవశేషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో దుస్తులు మరింత ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయితే బట్టలను ఉతికిన వెంటనే పూర్తిగా ఆరబెట్టడం కూడా అంతే ముఖ్యం.డిటర్జెంట్ అవశేషాలను తొలగిస్తుందిడిటర్జెంట్ను ఎక్కువగా ఉపయోగించినప్పుడు, దుస్తులపై సబ్బు పూర్తిగా తొలగకపోతే అవి గట్టిగా, రఫ్‌గా అనిపించవచ్చు. తగిన మోతాదులో వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కొన్ని డిటర్జెంట్ అవశేషాలు తగ్గుతాయి. ముఖ్యంగా తువ్వాళ్లపై పేరుకున్న అవశేషాలను తొలగించడంలో వెనిగర్ ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది.వెనిగర్‌ను ఎలా ఉపయోగించాలిసాధారణంగా వైట్ వెనిగర్‌ను ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్ కంపార్ట్మెంట్లో పోయాల్సి ఉంటుంది. అయితే మోతాదు విషయంలో మీ వాషింగ్ మెషీన్ తయారీదారు సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వెనిగర్‌ను నేరుగా డిటర్జెంట్‌తో కలపకుండా, మెషీన్‌లోని ప్రత్యేక కంపార్ట్మెంట్ ద్వారా వాడండి. అలాగే ప్రతిసారీ వెనిగర్ ఉపయోగించడం మంచిది కాదు.అన్ని రకాల బట్టలకు సరిపోదువెనిగర్ను ప్రతి రకమైన వస్త్రాలకు ఉపయోగించడం మంచిది కాదు. సిల్క్, ఊలు, సున్నితమైన ఫ్యాబ్రిక్స్ వంటి వాటికి ప్రత్యేక సంరక్షణ అవసరం కావచ్చు. అలాంటి దుస్తులపై ముందుగా వాషింగ్ లేబుల్లోని సూచనలను చదవాలి. రంగు పోయే అవకాశం ఉన్న ప్రత్యేక దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం.ఎక్కువగా వాడొద్దువెనిగర్ సహజమైన పదార్థమే అయినా.. ఎక్కువ మోతాదులో తరచూ ఉపయోగించడం వల్ల ప్రయోజనం కంటే నష్టం కలిగే అవకాశం ఉంది. దీని ఎసిడిక్ గుణం కాలక్రమేణా కొన్ని దుస్తుల, ఫైబర్లు, వాషింగ్ మెషీన్‌లోని రబ్బర్ సీల్స్ లేదా ఇతర భాగాలపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా వెనిగర్‌ను బ్లీచ్‌తో ఎప్పుడూ కలపకూడదు.ప్రమాదకరమైన వాయువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాషింగ్ మెషీన్లో వైట్ వెనిగర్‌ను సరైన విధంగా, పరిమితంగా ఉపయోగిస్తే కొన్ని బట్టల దుర్వాసన, డిటర్జెంట్ అవశేషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇది డిటర్జెంట్‌కు ప్రత్యామ్నాయం కాదు.ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.




