
విజయవంతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గూఢచారి-2’. వినయ్‌కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇండియన్ స్పైథ్రిల్లర్ జోనర్‌ను పునర్నిర్వచిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో వామికాగబ్బి, ఇమ్రాన్హష్మీ, మురళీశర్మ, సుప్రియా యార్లగడ్డ, మధుశాలిని కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.





