
బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలతో బీఎస్సీ చదువుతున్నాను. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఇవి కాకుండా ఇంకా ఎలాంటి సబ్జెక్టులు చదవొచ్చు? వేటితో మంచి భవిష్యత్తు ఉంటుంది? ప్రభుత్వ రంగం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ఆసక్తి ఉంటే ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఆహార పరిశ్రమలో కెరియర్‌ కోరుకుంటే ఫుడ్‌సైన్స్, నేర పరిశోధన ప్రయోగశాలలపై ఆసక్తి ఉంటే ఫోరెన్సిక్‌ సైన్స్‌ను పరిశీలించవచ్చు. కోర్సు పేరు కంటే ఆసక్తి, విద్యాసంస్థ, ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్పులు, పరిశోధన అనుభవం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఉద్యోగావకాశాలు, పరిశోధన, భవిష్యత్‌ అవకాశాలను కలిపి చూస్తే బయోటెక్నాలజీతో పాటు బయోఇన్ఫర్మాటిక్స్‌ లేదా డేటా అనలిటిక్స్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





