
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగ వాతావరణం మిన్నంటింది. వీధివీధినా గణపతి మండపాలు, ప్రతి ఇంట్లో పూజలు, మోదకాల నైవేద్యాలు, 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో పండగ వాతావరణం నెలకొంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆహ్వానిస్తున్నారు.





