
ఒత్తిడితో సతమతమవుతున్నపుడు అద్దంలో చూస్తూ కామెడీ ఫేస్ పెట్టండి. అది మీకు నవ్వు తెప్పించేలా ఉండాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉంటే ఒత్తిడి దూరమవుతుంది.
వెనకవైపు వాకింగ్ చేయడం వల్ల మెదడు వేరే దిశలో ఆలోచిస్తుంది. దీంతో అనవసర ఆలోచనలు దూరమవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది.
కాఫీ, టీని బిగ్గరగా సౌండ్ చేస్తూ సిప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫన్నీగా అనిపిస్తుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది.
మీరు మర్చిపోయింది దొరికితే (వెహికిల్ కీ, ఇయర్ ఫోన్ వంటివి), ఏదైనా చిన్న పని గెలిస్తే విక్టరీ డ్యాన్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.
మీ ఫ్రెండ్‌కు ఏదో ఒక ర్యాండమ్ ఎమోజీ, ఎలాంటి వివరణ లేకుండా పంపండి. ఇది మీకు నవ్వు తెప్పిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఒత్తిడిగా ఉన్నపుడు అద్దం చూస్తూ లేదా నార్మల్‌గా నవ్వండి. బిగ్గరగా నవ్వితే ఒత్తిడి తొందరగా తగ్గుతుంది.
మీకు నచ్చిన మంచి సాంగ్‌ను ఆ పాటకు సింక్ లేకుండా చేసే పని సమయంలో హమ్ చేయండి. ఉదాహరణకు ఏదైనా జార్, బాటిల్ మూత ఓపెన్ చేస్తూ మంచి సీరియస్ మోటివేషనల్ సాంగ్ హమ్ చేయండి.
మీ ఇంట్లోని మొక్కతో ఈరోజు వాతావరణం గురించి సీరియస్‌గా మాట్లాడండి. ఇది మీకు కామెడీలా అనిపించాలి. ఒత్తిడి తగ్గేందుకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
మీరు తినే స్నాక్‌కు, మీరు చేసే పనికి, చూసే వస్తువుకు ఏదైనా ఫన్నీ పేరు పెట్టండి. ఇది మీతో పాటు మీ స్నేహితులకు నవ్వు తెప్పించేలా ఉండాలి. తద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.




