
అల్లం-వెల్లుల్లి పేస్ట్ చేయడం ఏమంత పెద్ద పని కాదు, కాకపోతే సరైన కొలతలు తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా ఇంట్లో చేసుకునే పేస్ట్ వారం నుంచి 10 రోజుల వరకు ఫ్రిజ్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు నెలల తరబడి నిల్వ ఉంచుకోవాలనుకుంటే, ఈ పేస్ట్‌ను ఐస్ ట్రేలో (Ice Cube Tray) వేసి డీప్ ఫ్రిజ్‌లో గడ్డకట్టించాలి. ఆ తర్వాత ఆ క్యూబ్స్‌ను జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి డీప్ ఫ్రిజ్లోనే భద్రపరిస్తే 2 నుంచి 3 నెలల వరకు ఏమాత్రం రంగు, రుచి మారకుండా వాడుకోవచ్చు. గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది.తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.





