
Corporate Job Crisis : ఈసారి ఒరాకిల్ చేపట్టిన లేఆఫ్స్‌లో అత్యధికంగా 40ఏళ్లకు పైన వారే ఉన్నారని తెలుస్తోంది. ఇందులో దాదాపు 16శాతం మంది ఉద్యోగులు.. 60ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు వారేనట. AI ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా పెట్టుబడులు పెడుతున్న ఒరాకిల్.. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, డేటా సెంటర్ సపోర్ట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగిస్తోంది. దీంతో ఇప్పుడు 40ప్లస్ ఏజ్‌ను లేఆఫ్‌కు ప్రామాణికంగా కంపెనీలు చూస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది.





