
మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీపై విరక్తి చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. – బడంగ్పేట్, సెప్టెంబర్ 16 కాంగ్రెస్ సర్కార్ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించడంతో ఆ పార్టీ నాయకులు గులాబీ గూటికి వస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. పాత కొత్త అనే భావన లేకుండా పార్టీ పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తుమ్మలూరు వార్డు సభ్యులు జెనిగ శివ కుమార్, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి, గోడు కొండ్ల పర్వతాలు యాదవ్, మాజీ వార్డు సభ్యులు ఏనుగుల రాములు, మాజీ సొసైటీ డైరెక్టర్ మద్ది శ్రీధర్ రెడ్డి, శేఖర్ గౌడ్, అంజయ్య, లక్ష్మారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, సంపంగి రాజు, కొండల్ యాదవ్, ముక్కర వెంకటేష్, శివ, శ్రీశైలం యాదవ్ వీరితో పాటు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.





