
భామిని: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని నులకజోడు గ్రామంలో ఏనుగులు గత 20 రోజుల నుంచి సంచరిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆ గ్రామ సమీపంలో జలకలాడటంతో వాటిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. గత 20 రోజుల నుంచి ఆ చెరువు సమీపంలోనే మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలను తిని, చెరువులో నీళ్లు తాగుతూ జలకలాడుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా గజరాజులను చూస్తే మంచి జరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.