
Chiranjeevi
ఇంటర్నెట్‌డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధానపాత్రలో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీమ్ అప్డేట్ ఇచ్చింది. సినిమా (Mega 158 Update) టైటిల్‌ను ‘కాకా’గా ఖరారు చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో (Kaaka) చిరంజీవి మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నారు. అక్వా సంస్థలో ఉద్యోగిగా చిరంజీవి సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు. ‘ఇది సత్య మాట.. ఇంకా డౌటా’ అనే డైలాగు ఆయన పాత్ర స్వభావాన్ని తెలుపుతోంది. ఇందులో కనిపించిన ‘ఐ లవ్ డాడీ’ అనే కీ చైన్‌కు.. ప్లాష్ బ్యాక్‌లో ఆయనకు తండ్రితో అనుబంధం ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రివీల్ అనంతరం యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజు.. మెగా ఫ్యాన్స్‌కు వింటేజ్ చిరును గుర్తుచేస్తోంది. ఇక ‘కాకా’ సినిమా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది (kaaka Movie Release Date). ‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు - బాబీ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే ఈసారి ఓ చక్కటి భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు