
ప్రస్తుత రూ.15 వేల నుంచి పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం అదనంగా 51 లక్షల మంది వేతన జీవులకు లబ్ధి అధిక పొదుపు, పింఛన్లకు అవకాశం దిల్లీ: కార్మికులకు చట్టబద్ధమైన సామాజిక భద్రత ప్రయోజనాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర మంత్రి మండలి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నెలవారీ గరిష్ఠ వేతన పరిమితిని రూ.25వేలకు పెంచింది. గత పన్నెండేళ్లుగా ఈ పరిమితి రూ.15వేలుగా ఉంది. తాజా నిర్ణయం వల్ల 51 లక్షల మంది వేతన జీవులు ఈపీఎఫ్‌వో కవరేజీ పరిధిలోకి అదనంగా రానున్నారు. ఇప్పటికే ఉన్న సభ్యుల పీఎఫ్‌ పొదుపు, పింఛను మొత్తాలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం గురువారం (ఈ నెల 17) విశ్వకర్మ జయంతి రోజు నుంచే అమలులోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





