
బ్రహ్మపుర నగరం: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం గంజాం జిల్లా బ్రహ్మపురలోని పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత బ్రహ్మపుర గణేష్ నగర్ కూడలి వద్ద జరిగింది. ఓ ద్విచక్ర వాహన చోదకుడు అదుపు తప్పి లారీ వెనుక చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.