
ఉంగుటూరు: శునకాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో 216ఏ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరుకు చెందిన చైతన్య ప్రకాష్ (27), కోడూరు మండలం జున్నూరు చెందిన జుత్తిగ చిన్న వెంకటేశులుతో కలిసి ద్విచక్ర వాహనంపై ద్వారకాతిరుమలకు బయలుదేరారు. మార్గంమధ్యలో కైకరం శివారులోకి వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న బైక్‌కు అడ్డంగా ఓ శునకం వచ్చింది. దాన్ని ఢీకొని ఇద్దరు కిందపడిపోయారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న చైతన్య ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్న వెంకటేశులు గాయపడ్డారు. మరోవైపు శునకం కూడా మృత్యువాతపడింది. స్థానికులు క్షతగాత్రుడ్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





