
తిరువూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్‌లో జరిగింది. బైక్‌పై వెళ్తున్న మల్లెల గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ జమలయ్యను మరో బుల్లెట్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జమలయ్యతోపాటు బుల్లెట్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





