
Bigg Boss Telugu 10 First Week Third Elimination బిగ్ బాస్ ఇంట్లో ఈ పదో సీజన్‌లోని మొదటి వారమే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అంటూ ఇద్దరిని పంపించారు. ఈ ఇద్దరూ తిరిగి వస్తారని చాలా మంది అనుకుంటున్నారు. అయితే చరణ్, చైత్ర ఇంట్లోనే ఉన్నారంటూ వీడియో కాల్స్‌లో మాట్లాడించాడు నాగ్. అయితే అది హోటల్ కర్టెన్స్లా ఉందని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మళ్లీ ఈ ఇద్దరినీ ఇంట్లోకి తీసుకు వస్తారని కొందరు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మూడో ఎలిమినేషన్‌కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.






