
‘ఎక్స్‌’లో వైకాపా అధినేత జగన్‌ ఈనాడు, అమరావతి: డీఎస్సీలో స్కాం జరిగిందనడానికి కర్నూలు జిల్లాకు చెందిన ఈడిగ ప్రభాకర్‌కు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం రావడమే నిదర్శనమని వైకాపా అధినేత జగన్‌ ఎక్స్‌లో ఆదివారం పోస్టుచేశారు. టెట్‌లో అర్హత సాధించాలంటే అతడికి 75 మార్కులు రావాల్సి ఉండగా, 65 మార్కులే వచ్చినా ఉద్యోగమిచ్చారని ఆరోపించారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రభాకర్‌ అనర్హుడని డీఈవో ధ్రువీకరించారని, అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని, ఇదేనా ఏడు దశల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అంటే అని ప్రశ్నించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





