
రోజ్ వాటర్ నేచురల్ టోనర్లాగా పనిచేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఓపెన్ పోర్స్ క్లీన్ చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీనికోసం ఫేస్ వాష్ చేసుకున్నాక రోజ్ వాటర్ టోనర్ లాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది.
ముఖంపై జిడ్డు, మురికి తొలగించి ఓపెన్ పోర్స్ సమస్యను నివారించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. దీనికోసం ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలు.
ముఖంపై దుమ్ము, ధూళి తగ్గించి ఓపెన్ పోర్స్ సమస్యకు చెక్ పెట్టడంలో తేనె, నిమ్మరసం సహాయపడతాయి. దీనికోసం నిమ్మరసంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు.
ఓపెన్ పోర్స్ సమస్య తగ్గించడంలో కోడిగుడ్లు సహాయపడతాయి. దీనికోసం కోడిగుడ్డు తెల్లసొనను నేరుగా ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే చాలు.
అలోవెరాలోని సమ్మేళనాలు ముఖంపై రంధ్రాలను క్లీన్ చేస్తుంది. చర్మాన్ని క్లియర్ చేసి అందంగా మారుస్తుంది. దీనికోసం అలోవెరాను చర్మానికి బాగా అప్లై చేసి గంట తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.
టొమాటోలోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిపిస్తుంది. ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గిస్తుంది. దీనికోసం టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు.
చర్మాన్ని కూల్ చేసి ఓపెన్ పోర్స్ కుచించుకుపోయేలా చేయడంలో ఐస్ క్యూబ్ సహాయపడుతుంది. దీనికోసం ఐస్ క్యూబ్‌ను శుభ్రమైన క్లాత్‌లో చుట్టి ముఖంపై మర్దన చేయండి. 10 నిమిషాలు ఇలా చేసి ముఖం క్లీన్ చేసుకుంటే చాలు.
నేచురల్ స్క్రబ్ లాగా పనిచేసి ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గించడానికి బేకింగ్ సోడా వాడవచ్చు. దీనికోసం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోండి. కాసేపయ్యా క్లీన్ చేసుకుంటే చాలు.
చర్మం పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసి ముఖంపై రంధ్రాలను క్లీన్ చేయడంలో వెనిగర్ సహాయపడుతుంది. దీనికోసం వెనిగర్, నీళ్లు సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకోండి. పది నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలు.





