
Accident : మూవీ టీమ్ లో అందరూ తమ సినిమాల కోసం కష్టపడతారని తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో లేదా యాక్షన్ సన్నివేశాలలో నటీనటులకు, పలువురు సాంకేతిక నిపుణులకు దెబ్బలు తగలడం, సీరియస్ గాయాలు అవ్వడం జరుగుతూనే ఉంటాయని తెలిసిందే. అయితే ఈ మూవీ యూనిట్ కి మాత్రం సినిమా మొత్తం పూర్తయి రిలీజ్ సందడిలో ఉండగా యాక్సిడెంట్ అయింది. ఆ సినిమా పేరు తత్వం. దినేష్ తేజ, దష్విక జంటగా తెరకెక్కిన తత్వం సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా రెండు నెలలు వాయిదా పడి అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా హీరోయిన్ దష్విక మీ



