
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)కి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో నమోదైన ఓ ఎన్నికల కేసులో ఆయనపై కూటమి సర్కార్ తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇవాళ స్టే మంజూరు చేసింది.
దీంతో ఈ కేసులో కొడాలికి ఊరట లభించినట్లయింది. 2021లో నమోదైన ఈ కేసులో ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న కూటమి సర్కార్ కు ఇది ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.