
బూర్గంపహాడ్, జూన్ 30 : గ్రామాభివృద్ధి ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యే పని కాదని, ప్రజల భాగస్వామ్యం, ప్రజా ప్రతినిధుల సమన్వయం, అధికారు
ల సహకారం కలిసి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ పంచాయతీ సర్పంచ్ తాటి వాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. పంచాయతీలో అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు వీధుల్లో విద్యుత్ సౌకర్యం మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో నిరంతర కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీలో ప్రతి ఇంటి ముంగిటకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని, కృష్ణసాగర్ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.