
అస్సాంలోని గువాహటిలో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 37 కేజీల మేలిమి బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 55 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో నింది
తుడి ఇంట్లో సోదాలు నిర్వహించి.. అతడిని అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. దీని వెనక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 37 కేజీల బంగారం స్వాధీనం |