
KGF సిరీస్ తర్వాత యశ్ తర్వాతి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యశ్ ప్రస్తుతం 'టాక్సిక్' మూవీ చేస్తున్నాడు. ఇది చిత్రీకరణ పూర్తయ్యింది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఎప్పుడో సమ్మర్లో రావాల్సిన ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదు. యుద్ధం కారణంగా వాయిదా వేసినట్టు చిత్ర వర్గాలు చెప్పాయి. కానీ రిలీజ్ పై క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు యశ్ `టాక్సిక్`ని పక్కన పెట్టాడు. కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు.
నర్తన్ దర్శకత్వంలో యశ్ ఈ మూవీ చేస్తున్నాడని సమాచారం. ఇందులో `యానిమల్` ఫేమ్ డిమ్రి తృప్తి హీరోయిన్గా నటిస్తుందట. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథ ఒక మాజీ సైనికుడి చుట్టూ తిరుగుతుందట. హీరో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సైన్యాన్ని వదిలేసి, తన సొంత ప్రాంతంలో పోలీస్ ఫోర్స్లో చేరతాడు.
ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ 'ధర్మ ప్రొడక్షన్స్' నిర్మిస్తోంది. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా ఉన్నారు. 'సప్త సాగరదాచె ఎల్లో' ఫేమ్ హేమంత్ ఎం. రావు, యశ్ కలిసి ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. నర్తన్ పవర్ఫుల్ డైరెక్షన్, యశ్ మ్యానరిజం కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.