Best Tata Funds: లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ హౌస్ కోసం చూస్తుంటే టాటా మ్యూచువల్ ఫండ్ (Tata Mutual Fund) ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.
ఈ ఫండ్ హౌస్ వద్ద ప్రస్తుతం అసెస్ట్స్ అండర్ మేనేజ్మెంట్ (AUM) రూ .2.03 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఏఎంసీ పోర్ట్ ఫోలియోలో మొత్తం 68 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాల పనితీరు గమనిస్తే అందులో 4 ఫండ్స్ అదరగొట్టాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)ద్వారా హైరిటర్న్స్ ఇచ్చాయి. ఈ నాలుగు ఫండ్స్ సగటున వార్షిక రాబడి 18 శాతం వరకు అందించాయి. టాటా ఇండియా ఫార్మా, హెల్త్‌కేర్ ఫండ్టాటా మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలోని 68 ఫండ్స్‌లో గత 10 ఏళ్లలో టాటా ఇండియా ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ (Tata India Pharma And Healthcare Fund- Direct Plan) హైరిటర్న్స్ ఇచ్చింది. పదేళ్ల సిప్ రాబడి చూస్తే సగటున 18.46 శాతం చొప్పిన అందించింది. ఇందులో రూ. 10 వేల సిప్ పొదుపు చేసిన వారికి రూ. 31.70 లక్షల వరకు వస్తాయి. టాటా మిడ్ క్యాప్ ఫండ్టాటా ఏఎంసీలో అత్యధికంగా లాభపడిన ఫండ్స్‌లో టాటా మిడ్ క్యాప్ ఫండ్ (Tata Mid Cap Fund Direct Plan) రెండో స్థానంలో ఉంది. గత 10 ఏళ్ల రిటర్న్స్ చూస్తే సగటున 18.30 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇచ్చింది. ఇందులో నెలకు రూ. 10 వేలు పదేళ్ల పాటు జమ చేసి ఉంటే ఇప్పుడు రూ. 31.25 లక్షల వరకు వస్తాయి. టాటా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ టాటా ఏఎంసీ నుంచి వచ్చిన టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ( Tata Infrastructure Fund Direct Plan) గత పదేళ్లలో సగటున 18.23 శాతం వార్షిక రాబడి ఇచ్చింది. సిప్ పద్ధతిలో రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ. 31.10 లక్షలు వస్తాయి.టాటా రీసోర్సెస్, ఎనర్జీ ఫండ్టాటా రీసోర్సెస్ అండ్ ఎనర్జీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ( Tata Resources And Energy Fund Direct Plan) స్కీమ్ గత 10 ఏళ్లలో 18.02 శాతం వార్షిక రాబడి అందించింది. ఇందులో నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు రూ. 30.89 లక్షలు వస్తాయి.