
ఇంటర్నెట్ డెస్క్: పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు (Pune realtor Murder) మరో కొత్త మలుపు తీసుకుంది. ప్రధాన నింది
తురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ (Sahil)పై అశుతోష్ అనే న్యాయవాది రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సాహిల్ తనపై ఆరోపణలు చేశారని పేర్కొంటూ నోటీసులు (Defamation Notice) పంపారు. ఆరోపణలను ఉపసంహరించుకోవాలని.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు పేపర్లపై సియాతో అశుతోష్ మోసపూరితంగా సంతకాలు చేయించారని.. ఆయన తమ లాయర్ కాదని సాహిల్ మీడియాకు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాను అతడిపై పరువు నష్టం దావా వేసినట్లు అశుతోష్ తెలిపారు.
పోలీసు కేసు నమోదైన వెంటనే తన బృందం స్వచ్ఛందంగా సియా గోయల్ (Siya Goyal)ను కలిసి.. ఆమె తరఫున కేసు వాదించడానికి అనుమతి పొందినట్లు అశుతోష్ పేర్కొన్నారు. కోర్టులో కూడా తానే సియా న్యాయవాది అంటూ పత్రాలు సమర్పించారు. అయితే సోమవారం జరిగిన విచారణలో అశుతోష్ తన న్యాయవాది కాదని.. విపుల్ దుసింగ్ అనే లాయర్ తన కేసును వాదిస్తున్నారని సియా కోర్టుకు వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు కూడా పేర్కొనడంతో కోర్టు రూమ్‌లో హైడ్రామా నెలకొంది.
ఇదిలా ఉండగా నిందితులు సియా, చేతన్‌లను మరికొన్ని రోజులు తమ కస్టడీలోనే ఉంచాలని పోలీసులు కోర్టును కోరారు. కేతన్‌ను హతమార్చడానికి అనువైన ప్రదేశాన్ని వెతకడానికి ఇరువురు గతంలో లోహ్‌గఢ్ కోటను సందర్శించినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం ప్లాన్ ప్రకారం వారు ఎంపిక చేసిన చోటుకు కేతన్‌ను తీసుకువెళ్లి కిందకు తోసేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ముంబయి(Mumbai)ని ముంచెత్తుతున్నాయి.