
వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కోసం యూజర్‌నేమ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. కంపెనీ ప్రకారం.. వాట్సాప్‌లో పబ్లిక్ యూజర్‌నేమ్ డైరెక్టరీ ఉండదు. అంటే..
మీ ఒరిజినల్ యూజర్‌నేమ్ తెలిస్తేనే ఎవరైనా మిమ్మల్ని ఫస్ట్ టైమ్ కాంటాక్టు అవ్వగలరు.
ఫోన్ నంబర్‌కు ఫుల్ ప్రైవసీ : వాట్సాప్ యూజర్లు తమ యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకుంటే.. ఫస్ట్ టైమ్ చాట్ ఓపెన్ చేయగానే మొబైల్ నంబర్ అవతలి వ్యక్తికి కనిపించదు. మొబైల్ నెంబర్ ఇతరులకు కనపడకుండా, ఎవరికి షేర్ చేయడం ఇష్టపడని వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
Read Also : Lava Agni 4 5G : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. లావా అగ్ని 4 5G అతి చౌకైన ధరకే.. ఈ డీల్ అస్సలు మిస్ అవ్వొద్దు!
కంపెనీ ఆప్షనల్ యూజర్‌నేమ్ కీ ఫీచర్‌పై కూడా వర్క్ చేస్తోంది. ఒకవేళ వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ఆన్ చేస్తే వారి యూజర్‌నేమ్ తెలిస్తే చాలు.. ఎవరూ వారికి మెసేజ్ పంపకుండా ఆపేయొచ్చు. అదనపు ప్రైవసీ కోసం యూజర్‌నేమ్ కీ కూడా అవసరం పడుతుంది.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కోసం యూజర్‌నేమ్ : క్రియేటర్లు, చిరు వ్యాపారాలు, సంస్థలు తమ ప్రస్తుత ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ యూజర్‌నేమ్‌లను వాట్సాప్‌లో కూడా రిజర్వ్ చేసుకోవచ్చునని వాట్సాప్ తెలిపింది. అయితే, ఈ ఫీచర్ వినియోగదారులందరికీ ఎలా అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
యూజర్‌నేమ్ జనరేటర్ టూల్ : మీకు ఇష్టమైన యూజర్‌నేమ్ ఇప్పటికే వాడుతుంటే.. అదే మాదిరి యూజర్‌నేమ్‌లను ఎంచుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ ‘యూజర్‌నేమ్ జనరేటర్’ అనే టూల్ కూడా అందిస్తుంది.
వాట్సాప్ యూజర్‌నేమ్‌ను ఎలా రిజర్వ్ చేసుకోవాలి? : ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికి ఇంకా అందుబాటులోకి రాలేదు. మీ ఖాతాకు అందుబాటులోకి రాగానే ఈ కింది విధంగా మీరు యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు.