
పుణెలోని లోహగడ్ కోటలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు తిరిగింది. ప్రధాన నిందితురాలైన సియా గోయల్ తరఫున వాదించే న్యాయవాది ఎవరు అనే దానిపై కొత్త వివాదం చెలరేగింది.
ఈ వివాదం ఇప్పుడు రూ.10 కోట్ల పరువునష్టం దావా వరకు వెళ్లడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సియా గోయల్ సోదరుడు సాహిల్‌కు న్యాయవాది ఆశుతోష్ శ్రీవాస్తవ ఈ నోటీసు జారీ చేశారు.అసలేం జరిగింది?జూన్ 18న తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగడ్ కోట శిఖరం నుంచి తోసేసి హత్య చేసినట్లు సియా గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తన తరఫున వాదించేందుకు సియా స్వయంగా వకాలత్‌నామాపై సంతకం చేసి తనను నియమించుకున్నారని పుణెకు చెందిన న్యాయవాది ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే, ఈ వాదనను సియా సోదరుడు సాహిల్ గోయల్ ఖండించారు. తమ కుటుంబం విపుల్ దుషింగ్ను న్యాయవాదిగా నియమించిందని ఆయన ప్రకటించారు.ఈ గందరగోళం నడుమ వడగావ్ మావల్ కోర్టులో విచారణ సందర్భంగా సియా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆశుతోష్ శ్రీవాస్తవ నా లాయర్ కాదు. విపుల్ దుషింగ్ నా తరఫున వాదిస్తున్నారు" అని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో వివాదం మరింత ముదిరింది.రూ.10 కోట్ల పరువునష్టం నోటీసుకోర్టులో సియా చేసిన వ్యాఖ్యలు, ఆమె సోదరుడు సాహిల్ మీడియాకు ఇచ్చిన స్టేట్మెంట్పై న్యాయవాది ఆశుతోష్ శ్రీవాస్తవ తీవ్రంగా స్పందించారు. తన పరువుకు నష్టం కలిగించారంటూ సాహిల్‌కు రూ.10 కోట్ల