
యూరప్ నిప్పుల కొలిమిలా మారింది. ఇప్పటికే దాదాపు పదమూడు వందల మందికిపైగా ప్రజలు మరణించారు. పాఠశాలలు మూసివేశారు. విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో యూరప్‌లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో వడగాలులు వీస్తున్నాయి. దాంతో ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరిన వారికి వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
భూమిపై అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం యూరప్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ పేర్కొన్నారు. ప్రస్తుతం 15 మిలియన్ల ప్రజలు.. ఈ అత్యధిక ఉష్ణోగ్రతల్లో జీవిస్తున్నారని తెలిపారు. స్కూళ్లు మూసివేశారని.. అలాగే విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలాయని పేర్కొన్నారు.
మరో వైపు యూరప్‌లో ఎండలు, ఉష్ణోగ్రతలు, వేడి తీవ్రత కారణంగా.. ఈ ఖండంలో చోటు చేసుకున్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ దాటింది. దీంతో గుడ్లు, బేకన్‌ను నేరుగా ఎండలోనే వేయిస్తున్నారు. ఈ వేడి కారణంగా.. రైలు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. పాఠశాలలు మూసివేశారు. అణు శక్తి రంగానికి చెందిన కొన్ని విభాగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సహారా వైపు నుంచి వీస్తున్న వేడి గాలి.. దక్షిణ ఐరోపాను ఆవరించి.. తూర్పు దిశగా కదులుతోంది.
పారిస్‌లో ఓ మహిళ తన గదిలో చాక్లెట్ బార్ కేవలం గంటలోపే పూర్తిగా ఎలా కరిగిపోయిందో ప్రత్యక్షంగా చూపించింది. ఈ నగరాన్ని అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నిర్మించలేదు. దీంతో ఈ నగరం పరిసర ప్రాంతాలన్నీ నిప్పులు కొలిమిలాగా మార్చేస్తున్నాయి. దీంతో వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 21వ తేదీ నుంచి యూరప్‌లో నమోదైన తీవ్రమైన వేడి కారణంగా.. 1300 మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. ఒక్క ఫ్రాన్స్‌లోనే సుమారు వెయ్యి మందికి పైగా మృతి చెందారని గణాంకాలతో సహా పేర్కొంది. రహదారిపై వెళ్తున్న కారు టైర్లకు తారు అంటుకుని పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తుంది.
సింధూ జలాలను నియంత్రిస్తున్న చేతులను ఇస్లామాబాద్ నరికేస్తుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు
బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం.. ఏడాదికి రూ.18.9 కోట్ల విలువైన పసిడి గాల్లోకి..
For More International news And Telugu News