
అగ్నిపర్వతాలు అంటే లావా, బూడిద, విషవాయువులు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ అంటార్కిటికాలో ఉన్న ఓ అగ్నిపర్వతం మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఏటా రూ.
కోట్ల విలువైన స్వచ్ఛమైన బంగారాన్ని సూక్ష్మ కణాల రూపంలో గాల్లోకి విడుదల చేస్తోంది. ఈ అరుదైన ప్రకృతి విశేషం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టని మిస్టరీగా మిగిలింది.అంటార్కిటికాలోని రాస్ దీవిలో ఉన్న ‘మౌంట్ ఎరెబస్’ ప్రపంచంలోనే అత్యంత దక్షిణాన యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతం. ఇందులో ఎప్పుడూ మరిగే లావా సరస్సు ఉంటుంది. అదే దీని ప్రత్యేకతల్లో ఒకటి. మరో విశేషం ఏంటంటే.. ఈ అగ్నిపర్వతం నుంచి రోజూ సుమారు 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారం సూక్ష్మ స్ఫటికాల రూపంలో బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం చూస్తే ఇది రోజుకు సుమారు రూ.5.6 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.19 కోట్ల విలువ చేస్తుంది.ఈ బంగారం సాధారణంగా కనిపించే ధూళి కాదు. అత్యంత సూక్ష్మమైన స్ఫటికాల రూపంలో ఉంటుంది. కొన్ని కణాలు 60 మైక్రోమీటర్ల పరిమాణం కలిగి ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడే వాయువులతో కలిసి ఇవి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి చివరకు అంటార్కిటికా మంచుపై పడతాయి.బంగారం కణాలు అగ్నిపర్వతాల నుంచి బయటకు రావడం కొత్త విషయం కాదు. హవాయిలోని కిలౌయా, ఇటలీలోని ఎట్నా, అలాస్కాలోని ఆగస్టిన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ అగ్నిపర్వతాల దగ్గర కూడా స్వల్ప స్థాయిలో ఇలాంటి ఆనవాళ్లు గుర్తించారు. అయితే మౌంట్ ఎరెబస్లో ఈ ప్రక్రియ చాలా