
భారత మాజీ ఓపెనర్, దేశీయ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్‌కు భారీ కాంట్రాక్ట్ లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమ అన్ని విభాగాల జట్లకు అతన్ని మెంటార్‌గా నియమించింది.
Jun 30 2026 8:04 AM | Updated on Jun 30 2026 8:04 AM
భారత మాజీ ఓపెనర్, దేశీయ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్‌కు భారీ కాంట్రాక్ట్ లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమ అన్ని విభాగాల జట్లకు అతన్ని మెంటార్‌గా నియమించింది. ఈ పదవిలో జాఫర్ రెండేళ్ల పాటు కొనసాగుతారు. జాఫర్ నియామకాన్ని హెచ్‌సీఏ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు.
జాఫర్ నియామకంలో ఇటీవల హెచ్‌సీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టిన మరో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రాయుడుకే అప్పగించడంతో ఆయన సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌సీఏ వర్గాలు తెలిపాయి.
48 ఏళ్ల జాఫర్ భారత తరఫున 31 టెస్టులు, 2 వన్డేలు ఆడారు. భారత దేశీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోచింగ్‌లోనూ మంచి అనుభవం ఉన్న జాఫర్ గతంలో ఉత్తరాఖండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా, గత సీజన్లో విదర్భ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అలాగే బంగ్లాదేశ్ జాతీయ జట్టు, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌తో కూడా కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
రెండుసార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన హైదరాబాద్ (1937-38, 1986-87) ఇటీవలి కాలంలో దేశీయ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. 2025-26 రంజీ ట్రోఫీలో ఎలైట్ గ్రూప్-బిలో నాలుగో స్థానంలో నిలిచిన ఆ జట్టు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ లీగ్ దశలో నెట్ రన్‌రేట్ కారణంగా ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. విజయ్ హజారే ట్రోఫీలోనూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో జాఫర్ అనుభవం హైదరాబాద్ జట్టును మళ్లీ విజయాల బాట పట్టించగలదని హెచ్‌సీఏ ఆశిస్తోంది.
లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)
ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)
బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్ డే.. తమన్నా సందడి (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
కానిస్టేబుళ్ల లొంగుబాటు... నిజమా? నాటకమా? కోర్టులో ఏంజరిగిదంటే
డెలివరీ బాయ్‌తో హీరోకు ఘర్షణ... వీడియో వైరల్!
బంగారం ధరలు పెరిగినా ఎందుకు అమ్ముతున్నారు?
Big Question Full : అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ?
ఘట్కేసర్లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో!