
ఐటీఆర్ ఫైలింగ్ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి? ఐటీ నోటీసులు, పెనాల్టీలు పడకుండా ఏం చేయాలి? ఆన్లైన్లో సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయొచ్చా? Income Tax Return : టాక్స్ పేయర్లకు బిగ్ న్యూస్..
టాక్స్ సంబంధిత సమాచారం అంతా ఆన్లైన్లోనే.. ఏ కొంచెం చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు తప్పవు. మీకు తెలియకుండా పొరపాటు చేస్తే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) మీ పొరపాటును సరిదిద్దుకునేందుకు మీకో అవకాశం కల్పిస్తుంది. అదే సవరించిన రిటర్న్.. ఎలాంటి జరిమానా లేకుండా మీ పాత తప్పును వెంటనే సరిదిద్దుకోవచ్చు అనమాట. కొత్త సవరించిన రిటర్న్‌ను సమర్పించిన వెంటనే మీ పాత రిటర్న్ ఆటోమాటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. కొత్త రిటర్న్ వ్యాలీడ్ అవుతుంది. ఒకవేళ ITR ఫైల్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు చేశారా? పన్ను శాఖ నుంచి నోటీసు వస్తుందని ఆందోళన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5)ని ఉపయోగించండి. ఎలాంటి జరిమానా లేకుండా మీ తప్పును సరిదిద్దుకోవచ్చు. ఆన్లైన్లో సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయడం ద్వారా పాత తప్పును త్వరగా సరిదిద్దుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ సమాచారం సరిదిద్దొచ్చంటే? : మీ రిటర్న్‌ను సకాలంలో లేదా ఆలస్య రుసుములతో కొద్దిగా ఆలస్యంగా దాఖలు చేసినా మీరు సరిదిద్దుకోవచ్చు. మీరు ఏదైనా ఆదాయాన్ని మళ్లీ యాడ్ చేయొచ్చు. తప్పుగా ఉన్న ఆదాయాన్ని సరిదిద్దవచ్చు. పన్ను మినహాయింపులను సవరించవచ్చు లేదంటే తప్పుగా ఉన్న ఐటీఆర్ ఫారమ్‌ను మార్చవచ్చు. మీరు రీఫండ్ పొందిన తర్వాత కూడా మీ తప్పును సరిదిద్దుకోవచ్చు. Read Also : OnePlus Nord Buds 4 : వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఫస్ట్ సేల్.. 54 గంటల బ్యాటరీ లైఫ్ అదుర్స్, ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..! సకాలంలో పూర్తి చేయండి : తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ అవకాశం లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్న్‌ను పరిశీలించడం పూర్తి చేస్తే మీరు ఇకపై సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయలేరు. నిర్దేశించిన సమయంలో మీ రిటర్న్‌ను ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎడిట్ చేయొచ్చు. అన్ని తప్పులను ఒకేసారి సరిదిద్దుకోవడం బెటర్. డెడ్ లైన్ దాటితే ఏం చేయాలి? : ఒకవేళ డెడ్ లైన్ దాటితే సవరించిన రిటర్న్ (ITR-U)ను దాఖలు చేసేందుకు మీకు లాస్ట్ ఛాన్స్ ఉంటుంది. రాబోయే 4 ఏళ్ల వరకు మీ రిటర్న్‌లను అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే, ITR-Uను దాఖలు చేయడం వల్ల అదనపు పెనాల్టీలు, వడ్డీ చెల్లించాలి. అంతేకాదు.. మీరు పన్ను తగ్గింపు గానీ లేదా రీఫండ్‌లో పెంపు గానీ క్లెయిమ్ చేయలేరు. రిటర్న్‌ను ఎలా దాఖలు చేయాలి? : ఆన్లైన్లో రిటర్న్ ఎడిట్ చేయడం చాలా ఈజీ. కేవలం ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి 'సవరించిన రిటర్న్' (Revised Return) ఆప్షన్ ఎంచుకోండి. మీ పాత రిటర్న్ నంబర్, తేదీని ఎంటర్ చేయండి. తప్పును సరిదిద్ది, మీ రిటర్న్‌ను తిరిగి సమర్పించండి. చివరగా, ఇ-వెరిఫికేషన్ (e-verification) చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే.. అది లేకుండా మీ రిటర్న్ పూర్తి కానట్టే..