
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Relationship Tips: స్నేహమైనా.. ప్రేమ సంబంధమైనా.. ఏ బంధం అయినా నిజమైన విలువ కష్ట సమయాల్లోనే బయటపడుతుంది. మన లైఫ్ పార్ట్ నర్ పట్ల ప్రేమను చూపిస్తాము. కానీ వారికి మన అవసరం ఎక్కువ ఉన్నప్పుడు .. మనం ఆ ప్రేమను తిరిగి ఇవ్వడంలో కొన్నిసార్లు విఫలమవుతుంటాం. మీ భాగస్వామి శారీరకంగా లేదా మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నడు వారికి మందులతోపాటు భావోద్వేగ మద్దతు కూడా అవసరం ఉంటుంది.
మానసిక ధైర్యం అన్నింటికంటే ముఖ్యం: అనారోగ్యానికి గురైనప్పుడు శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా వీక్ అవుతారు. ఆ సమయంలో వారికి కావాల్సింది మందులు మాత్రమే కాదు.. నేనున్నాను అనే నమ్మకం కావాలి. వారితోనే ఉంటూ చేతిని పట్టుకుని ధైర్యం చెబితే వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
2. ఓపిగ్గా వింటూ.. సున్నితంగా మాట్లాడటం: అనారోగ్యంతో ఉన్నప్పుడు కొందరికి చికాకు ఉంటుంది. ఇది సహజం. వారి ప్రవర్తనలో కూడా మార్పులు ఉంటాయి. అలాంటి సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. వారు ఏం చెప్పినా వినాలి. వారితో సున్నితంగా మాట్లాడాలి. చిన్న చిన్న అవసరాలు అడగానే తీర్చాలి. దీంతో ప్రేమ మరింత ఆప్యాయంగా మారుతుంది.
3. వైద్యుల సూచనలు పాటించాలి: భాగస్వామి అనారోగ్యాన్ని కేవలం ఆసుపత్రికే పరిమితం చేయకూడదు. వైద్యులు ఇచ్చిన మందులను ఇస్తూ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏ సమయంలో ఎలాంటి ట్యాబ్లెట్ వేసుకోవాలో మీరే దగ్గరుండి చూసుకోవాలి.
4. పౌష్టికాహారం ఇవ్వడం: అనారోగ్యంగా ఉన్నప్పుడు నోటికి ఏదీ రూచిగా అనిపించదు. అందుకే మీ భాగస్వామికి నచ్చినది.. పౌష్టికాహారం ఇవ్వాలి. వీలుంటే మీ చేతులతో తినిపిస్తే వారి మనస్సు మరింత తేలికపడుతుంది.
5. ఇంటి బాధ్యతలు మీరే చూసుకోండి: సాధారణంగా ఇంట్లో ఒకరు అనారోగ్యానికి గురవుతే ఆ ఇల్లంతా గందరగోళంగా మారుతుంది. ఆ సమయంలో ఇంటి పనులు మీరే చూసుకోండి. వంట, శుభ్రం చేయడం బాధ్యతగా తీసుకోండి.
కష్టాలు ఉన్నప్పుడు మనవాళ్లు ఎవరు..పరాయి వాళ్లు ఎవరో తెలిసిపోతుంది. అది భాగస్వామి విషయంలో మరింత స్పష్టం అవుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని మీ భాగస్వామిని చూసుకున్నట్లయితే.. వారి గుండెల్లో మీ స్థానం ఎప్పటికీ చెరిగిపోదు. మీ బంధం మునుపటి కంటే మరింత మధురంగా మారుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.