
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'.
నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నభా నటేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర నేను చేయలేదు. ఇందులో నేను పార్వతి పాత్రలో కనిపిస్తాను. తను ఒక వేద విద్యార్థిని. తన పాత్ర ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తన కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. కథలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పార్వతి తీసుకునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర చూసి ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు.
ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ ఇందులో చాలా గ్రాండ్‌గా చిత్రీకరించిన డాన్స్ నంబర్ ఉంది ఆ పాట చేయడం నిజంగా అద్భుతమైన అనుభవం. దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో ఆ పాటను గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అందులో క్లాసికల్ డాన్స్ కూడా ఉంటుంది. నిజంగా ఆ పాట బిగ్ స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. అది నాకు చాలా కొత్త అనుభవం. టెక్నికల్‌గా కూడా అంత పెద్ద కాన్వాస్‌పై ఆ పాటను చిత్రీకరించడం ఒక ఛాలెంజ్. అది కేవలం డాన్స్ సాంగ్ మాత్రమే కాదు... అందులో భక్తి భావం కూడా కనిపించాలని దర్శకుడు, కొరియోగ్రాఫర్‌కు ముందుగానే సూచించారు. ఆ పాట కోసం వేసిన సెట్ నిజంగా ఒక పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది.
ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు ఈ సినిమా కోసం నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఆ సెట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులను కూడా ఆ విజువల్స్ తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి. అలాగే ఈ సినిమాలో నా పాత్ర కోసం రెడీ అవ్వడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. ప్రతి కాస్ట్యూమ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఈ షూటింగ్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమా కోసం దాదాపు పది భారీ సెట్లు వేశారు. ప్రతి సెట్ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి భారీ చిత్రంలో నటించడం ఒక నటిగా నాకు గొప్ప అనుభవం. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మేమంతా చాలా నియమనిష్టలతో పని చేశాం. పూర్తిగా శాకాహారులుగా ఉన్నాం. అలాగే అక్కడ ఒక అర్చకుడిని నియమించి ప్రతిరోజూ పూజలు చేసిన తర్వాతే షూటింగ్ ప్రారంభించేవాళ్లం. అలాగే ఈ సినిమాలో రొమాన్స్ ఉంటుంది. అయితే దానికంటే చాలా ముఖ్యమైన అంశాలు నా పాత్రలో ఉంటాయి. అవే కథకు కీలక మలుపు తీసుకొస్తాయి. ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. కథకు బలం చేకూర్చే పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నమైన పాత్ర ఇది. ఈ పాత్ర చేసినందుకు చాలా గర్వపడుతున్నాను అని తెలిపింది. అలాగే నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల భుజానికి గాయం అయింది. ఆ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా పూర్తిగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలి. స్క్రీన్‌పై ఎనర్జీతో కనిపించినప్పుడే పాత్రకు న్యాయం చేయగలనని భావిస్తాను. అందుకే పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించడం ప్రారంభించాను.
ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి