.webp&w=3840&q=75)
తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) హోదాలో పనిచేస్తున్న 36 మంది అధికారు
లకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలు, విభాగాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్‌తో పాటు పలువురు ఉన్నతా ధికారులు పాల్గొన్నారు. పదోన్నతి పొందిన అధికారులను అభినందించిన డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ.. "పదోన్నతి అనేది హోదా పెరగడం మాత్రమే కాదు.. బాధ్యతలు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి" అని అన్నారు. పోలీసు శాఖ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ప్రజల సమ స్యలను సత్వరమే గుర్తించి చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీజీపీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలతో మరింత సత్సంబంధాలు పెంపొందించే దిశగా పనిచేస్తేనే పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొ న్నారు.
డీఎస్పీ హోదాలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలని, ఉన్నతాధి కారుల మార్గదర్శకాలను అనుసరిస్తూ సమర్థవం తమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని సూచిం చారు. ప్రజల భద్రత, సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అంకితభావంతో పనిచేసే అధికారులకు మరింత ఉన్నత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కీలక విషయం ఏమిటంటే, డీఎస్పీలుగా పదోన్నతి పొందిన ఈ 36 మంది అధికారులకు ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ లేదా ట్రాఫిక్ విభాగాల్లో కాకుండా, పోలీసు శాఖలోని ఇతర ప్రత్యేక విభాగాలు, యూనిట్లలో పోస్టింగ్‌లు కేటాయించారు. దీంతో ఆయా విభాగాల్లో పరిపాలనా సామర్థ్యం మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.
అల్వాల్ నిత్య పెళ్లికొడుకు కేసులో సంచలన మలుపు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో... లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు!
.