వృషభ రాశి వారికి జూలై నెలలో గ్రహాల సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో నిరాశను ఎదుర్కొంటారు. శని వక్ర గమన కాలంలో మీరు తీవ్ర నిరాశకు గురి కావొచ్చు.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు కొంత నష్టాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టపడి పని చేసినా నిరాశే ఎదురయ్యే అవకాశాలున్నాయి.
సింహ రాశి వారికి జూలై నెలలో గ్రహాల కదలిక కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శని దేవుడు వక్రగమనం కారణంగా అనేక సమస్యలు ఎదురవ్వొచ్చు. మీ వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురవ్వొచ్చు. ఈ సమయంలో మీరు అపరిచితులకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. లేదంటే మీ ఆర్థిక పరిస్థితి క్షీణించొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఇదే రాశిలో ప్రవేశించినప్పుడు మాత్రం మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. జూలై 16న సూర్యుడి సంచారం కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.
తులా రాశి వారికి జూలై నెలలో ప్రధాన గ్రహాల మార్పుతో చాలా రంగాల్లో అదృష్టం కలిసి రానుంది. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఆర్థిక పరమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. ఉద్యోగులకు జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపించొచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది.
జూలై నెల చివర్లో శని గ్రహం తిరోగమనం చెందడంతో మకర రాశి వారికి తాము చేసే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. జూలై 25 తర్వాత మీకు ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా కాళ్లు లేదా కీళ్ల నొప్పులు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.
జూలై నెలలో కుంభ రాశి వారికి గ్రహాల కదలిక సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఆశించిన విజయాన్ని సాధించలేరు. మీరు చేసే పనిలో నిరంతరం అడ్డంకులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలైనా తొందరపడి తీసుకోవడం మానుకోవాలి. మీ కుటుంబ పరిస్థితుల విషయంలో అత్యంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. జూలై చివరి వరాంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదని గుర్తుంచుకోండి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుకావొచ్చు. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి