
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీఎంసీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల ఖర్దాహ్‌లో పనిహాటి మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ జయంత దాస్ అలియాస్...
Jun 29 2026 8:22 PM | Updated on Jun 29 2026 8:26 PM
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీఎంసీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల ఖర్దాహ్‌లో పనిహాటి మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ జయంత దాస్ అలియాస్ గోబింద్ దాస్‌పై కొందరు కుళ్లిన గుడ్లు విసిరారు. ఖర్దాహ్ పోలీస్ స్టేషన్ నుంచి బరాక్‌పూర్ సబ్-డివిజనల్ కోర్టుకు పోలీసులు ఆయనను తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ బయట ఉన్న కొందరు జయంత దాస్‌పై కుళ్లిన గుడ్లతో దాడి చేశారు. దీన్ని ఎగ్ థెరపీ అని నిరసనకారులు అభివర్ణించారు. జయంత దాస్‌ను మాజీ పనిహాటి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు.
కుళ్లిన గుడ్లతో దాడి ఘటన తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గుడ్లు ఎవరు విసిరారు? నిరసనకు కారణం ఏమిటి? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత భద్రతను కూడా పెంచారు.
అవినీతి, వసూళ్లు, అక్రమ భూ వ్యవహారాలు, రాజకీయ హింస ఆరోపణలతో టీఎంసీ నేతలను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలు నిందితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్‌కు సన్నిహితుడిగా భావించే మాజీ టీఎంసీ కౌన్సిలర్ షమ్స్ ఇక్బాల్‌ను కూడా గార్డెన్ రీచ్ పోలీసులు రూ.70 లక్షల వసూళ్ల కేసులో అరెస్టు చేశారు.
ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)
బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్ డే.. తమన్నా సందడి (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు)
ఘట్కేసర్లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో!
"ఇతను ఒక కోచేనా?".. Gautam Gambhirపై వైరల్ పోస్టు!
రైలు పట్టాలపై పడుకుని.. క్షణాల్లో మారిన పరిస్థితి!
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ లొంగిపోయిన సాక్షులు...
కిల్లి రవి కేసు వెనుక అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు!