
Cape Verde| ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2026లో అండర్‌డాగ్‌గా కేప్ వర్డీ జట్టు సంచలనాలు సృష్టిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో శనివారం జరిగే రౌండ్ 32 మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేప్ వర్డీ సారథి ర్యాన్ మెండిస్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెండిస్ తన గదిలోకి ప్రవేశించి శారీరక, లైంగిక దాడికి పాల్పడినట్లు బ్రెజిల్‌కు చెందిన అనువాదకురాలు, ఫిఫా నియమించిన టీమ్ సపోర్ట్ వర్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో ఆక్లాండ్‌లో జరిగిన ఫిఫా సిరీస్ టోర్నమెంట్లో ఓ హోటల్లో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నల్గొండ నైట్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని నల్గొండ నైట్స్ 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ ఫొటోలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఎడిషన్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. లీగ్ దశలో తలపడిన 48 జట్లలో ఇప్పటికే 16 ఇంటిముఖం పట్టాయి. రౌండ్ 32 నుంచి క్వార్టర్స్‌కు మరో పదహారు జట్లు చేరతాయి. ఇప్పటి వరకు మ్యాచులను అభిమానులు ఆసక్తిగా తిలకించారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..