
గర్భం దాల్చిన మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ రావడం సహజం. అధిక బరువున్న మహిళల్లోనూ ఇవి కనిపిస్తాయి. చర్మం సాగిపోవడం కారణంగా ఏర్పడే వీటిని తగ్గించుకోవడానికి మహిళలు చాలానే శ్రమ పడుతుంటారు.
అయితే సహజ పద్ధతుల్లో వీటిని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..
చర్మంపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా కనుమరుగు కావంటున్నారు నిపుణులు. అయితే కొన్ని సహజ చిట్కాల్ని ఉపయోగించి వాటిని కొంతవరకు కనిపించకుండా చేయచ్చంటున్నారు.
⚛ కలబంద సైతం స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి సాయం చేస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జుని చర్మానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుందట.
⚛ ఆలివ్‌నూనెను ఉపయోగించడం ద్వారా కూడా పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్‌ని క్రమంగా దూరం చేసుకోవచ్చట. దీన్ని కొద్దిగా వేడి చేసి మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం కొంత వరకు ఉంటుందంటున్నారు నిపుణులు.
ఈ చిట్కాలు పాటించడంతో పాటు అవసరమైతే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల క్రీమ్స్, లోషన్స్ కూడా ఉపయోగించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.