
"మీరు కష్టపడి చదవండి.. విద్యాశాఖ మంత్రిగా మీ కలలను సాకారం చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను" అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.
సమాజంలో మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. గత ఏడాది టెన్త్, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా, ఆసక్తికరంగా సాగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 'డ్రీమ్ వాల్స్', 'గ్రాటిట్యూడ్ వాల్స్'పై విద్యార్థులు రాసిన మాటలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని లోకేశ్ తెలిపారు. విద్యార్థులు అద్భుతమైన సలహాలు ఇచ్చారని, వారిలో కొంతమంది అయినా రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లో ఉండటం వల్లే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విద్యా సంస్కరణలు ఏపీలో తీసుకురాగలుగుతున్నానని అన్నారు.త్వరలో ఏఐ ట్యూటర్.. బలోపేతం కానున్న గ్రంథాలయాలువివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ఆకాంక్షలు, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడకు చెందిన క్రాంతి అనే విద్యార్థి స్కూలు స్థాయి నుంచే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై శిక్షణ, మోటివేషన్ క్లాసులు, లైబ్రరీల అవసరాన్ని ప్రస్తావించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను ప్రక్షాళన చేస్తున్నామని, పుస్తకాలు చదవడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. మండలం, నియోజకవర్గం, జిల్లా, జోనల్ స్థాయిలో