
కొండచరియ విరిగిపడిన ఘటనలో ఒక బైకర్ తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న ఉదంతం తాజాగా అస్సాంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కొండచరియ విరిగి పడిన ఘటనలో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న ఒక బైకర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంతకు మించిన అదృష్టవంతుడు మరొకరు లేరంటూ జనాలు ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అస్సాంలో ఈ ఘటన వెలుగు చూసింది.
దిగువ సియాంగ్ వ్యాలీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఘాట్ రోడ్డులో ఒక బైకర్ వెళుతుండగా అకస్మాత్తుగా కింద నేల కదిలిపోయింది. అతడూ కిందకు జారిపోయాడు. మరికొన్ని క్షణాల్లో కింద ఉన్న నదిలోకి పడిపోతాడనంగా నేల జారడం నిలిచిపోయింది. దీంతో, అతడు నెమ్మదిగా బయటపడ్డాడు. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. బైకర్ నిజంగా అదృష్టవంతుడంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి లాటరీ టికెట్ కొంటే కోటీశ్వరుడైపోవడం పక్కా అని అంటున్నారు.
ఇటీవల కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. పలు చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి. లోయెర్ దిబాంగ్ జిల్లాలోని ఒక నదిలోని ద్వీపంలో చిక్కుకుపోయిన కొందరిని భారత ఆర్మీ కాపాడింది. గత వారం కేయి పన్యోర్ జిల్లాలో ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
'అందుకే నాకు భారత్ అంటే ఇష్టం'.. పోలండ్ మహిళ వీడియో వైరల్
నెదర్లాండ్స్లో భగ్గుమంటున్న ఎండలు.. ఆరుబయటే ఆమ్లెట్ వేసిన యువకుడు