
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్టర్ ను పంచుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కలయికల్లో ఇది ఒకటి కావడంతో ఈ ప్రకటనతో సినీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ విజయవంతమైన ద్వయం చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈసారి సరికొత్త కథాంశంతో, మునుపెన్నడూ చూడని రీతిలో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.దైవిక నేపథ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. కుమారస్వామి ఇతివృత్తంతో... పురాణాల స్ఫూర్తితో కూడిన కథ, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఈ దృశ్యకావ్యం ఉండబోతోందని సమాచారం. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ సంభాషణలు ఈ దైవిక కథకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయని అభిమానులు భావిస్తున్నారు.ఈ భారీ చిత్రానికి సాంకేతిక బృందం కూడా అదే స్థాయిలో ఉండనుంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. తన నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోసే అనిరుధ్, ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.నిర్మాణ విలువల