
కొత్త ఉపాధి పథకం ప్రారంభం. 125 రోజులకు పని దినాలు. మహిళా ఆర్థిక సాధికారతే లక్ష్యం. VB-GRAMG Scheme: గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో, జులై 1 నుండి "వికసిత్ భారత్ గ్రామీణ్ గ్యారంటీ మిషన్" (VB-GRAMG Scheme) అనే సరికొత్త ఉపాధి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. జులై 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఈ నూతన పథకం యొక్క జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. Saikrishna Murder Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు 125 రోజులకు పెరిగిన పని దినాలు.. మహిళా సాధికారతే లక్ష్యం: ఈ కొత్త పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీని మరింత బలోపేతం చేయడమే కాకుండా, పని దినాలను గతంలో ఉన్న 100 రోజుల నుండి ఏకంగా 125 రోజులకు పెంచింది. గ్రామీణ కుటుంబాల ఆదాయ వనరులను పెంచడం, స్థిరమైన జీవనోపాధిని కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు, మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున ‘లక్ష్మీపతి దీదీల’ను (ఆర్థిక స్వాలంబన సాధించిన మహిళలు) సృష్టించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సాంకేతికత, పారదర్శకతతో గ్రామీణ ఆర్థిక వృద్ధి: 'వికసిత్ భారత్ @2047' లక్ష్య సాధనలో భాగంగా.. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ మరియు ఆధునిక సాంకేతికత వినియోగానికి ఈ పథకంలో పెద్దపీట వేశారు. అవినీతికి తావులేకుండా ఉండేందుకు బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ పర్యవేక్షణ మరియు కఠినమైన సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) విధానాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఈ పథకం అమలుకు సన్నాహాలు పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. ఈ చారిత్రాత్మక మార్పు ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కనుంది.