
ఏపీలో ఈ నెల 15న ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (AP SIR) ప్రస్తుతం చురుగ్గా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంతో పాటు పాత ఓట్లతో వాటిని లింక్ చేసే...
ఏపీలో ఈ నెల 15న ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (AP SIR) ప్రస్తుతం చురుగ్గా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంతో పాటు పాత ఓట్లతో వాటిని లింక్ చేసే కార్యక్రమం కూడా ఉండటంతో బీఎల్వోలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఎల్వోలుగా ఉన్న స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. ఆయన ముందు ఎస్ఐఆర్ గడువు పొడిగించాలనే ప్రతిపాదన పెట్టారు.AP SIR 2026: ఈ రెండూ ఉంటే చాలు-ఆన్ లైన్ లో ఎస్ఐఆర్ పూర్తి-7 స్టెప్స్ ఇలా..!స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు గడువు పొడిగించి,బీఎల్వోలపై పని ఒత్తిడి తగ్గించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోరింది. ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు అనేక ఆచరణాత్మక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు సీఈవోకు తెలిపారు. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, పాత ఎన్నికల వివరాల ధృవీకరణలో సమస్యలు, ఓటర్లు అసంపూర్ణంగా నమోదు ఫారాలు సమర్పించడం వంటి కారణాలతో నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తి చేయడం కష్టసాధ్యమని తేల్చేశారు. తెలంగాణలో SIR ప్రక్రియ మొదలు- ఆన్ లైన్, ఆఫ్ లైన్లో ఇలా చేసుకోండి..!ఈ నేపథ్యంలో ఎస్‌ ఐ ఆర్ కార్యక్రమానికి తగిన గడువు పొడిగించాలని, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఎల్వోలపై అనవసర ఒత్తిడి తొలగించాలని వారు కోరారు. విధుల నిర్వహణలో రాజకీయ జోక్యం లేదా వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇతర అధికారిక పనులు అప్పగించకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను సానుకూలంగా పరిగణించి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తయ్యేలా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.AP SIR: ఏపీలో సర్ పై ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి 28 ఐఏఎస్ లు..!