
Tungabhadra River Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన వారిలో ఐదుగురు గల్లంతవగా, వారిలో...
Tungabhadra River Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన వారిలో ఐదుగురు గల్లంతవగా, వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న (శనివారం) నదిలో మునిగిపోతున్న ఒక ఐదేళ్ల బాలుడిని రక్షించే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. నదిలో కొట్టుకుపోయిన మిగతా ఇద్దరి కోసం స్థానిక పోలీసులు, ఈతగాళ్లు ప్రవాహంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Also :Tungabhadra river: తుంగభద్రలో ఐదుగురు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరంతా తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారి యువన్ చంద్ర ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన మిగతావారు, అతడిని కాపాడేందుకు ఒకరినొకరు పట్టుకుని నదిలోకి దిగారు. అయితే, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బాలుడితో పాటు అతడిని రక్షించబోయిన మరో నలుగురు కూడా నదిలో గల్లంతయ్యారు.
నదిలో మునిగిపోయిన వారి కోసం నిన్నటి నుండి గాలింపు చేపట్టగా, ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులలో హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు ఉండటం ఆ కుటుంబంలో తీవ్ర గుండెకోతను మిగిల్చింది.
ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైన మరో ఇద్దరి కోసం తుంగభద్ర నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ఉరవకొండకు చెందిన సంధ్య (22) ల కోసం గజ ఈతగాళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు నదీ పరివాహక ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Save the Tigers 3: సేవ్ ది టైగర్స్ 3 సిరీస్ ట్రైలర్ విడుదల
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
SSY Scheme : ఆడపిల్ల భవిష్యత్తుకు బంగారు పథకం.. ₹70 లక్షలు ఎలా?
Smoking: స్మోకింగ్ కేవలం ఊపిరితిత్తులకే హాని చేస్తుందా? వైద్యులు ఏమంటున్నారంటే?
Miyazaki Mangos: విదేశాల్లో రూ.2 లక్షలు.. ఇక్కడ కేవలం రూ.999కే ‘మియాజాకీ’!
Sangareddy crime: బైక్ కొనివ్వలేదని భార్యను ఉరివేసి చంపి, భర్త ఆత్మహత్య
Russia Taliban Deal : ఆఫ్ఘన్‌కు రష్యా మద్దతు.. పాక్‌లో కొత్త ఆందోళనలు!
Lifestyle Manager : కోటీశ్వరుల ఇళ్లలో కొత్త ట్రెండ్.. లైఫ్ స్టైల్ మేనేజర్ల హవా!
హైదరాబాద్: సోషల్ మీడియాలో మహాలక్ష్మి పథకం స్మార్ట్ కార్డులపై జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెలంగాణ ప్రభుత్వం...
2026లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా...
ఆసిఫాబాద్, మే 30: బాలికలు, మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి...
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి తదితర ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున దాడులు, పేలుళ్లు...
విజయనగరం, మే 30: అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు ఉండే గదులు ఇంత...
Mahila Shakti Super Markets; మహబూబ్‌నగర్, మే 30: మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడేలా తెలంగాణ...
కొమురవెల్లి, మే 30: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు...
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో తీవ్ర శోకం మిగిల్చే ఘోర ప్రమాదం సంభవించింది. తుంగభద్ర...
రాశి ఫలాలు – 31 మే 2026 మేష రాశి మిత్రుల నుండి మీరు ఆశించిన...
బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.