
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. రోజూ మట్టిని తవ్వుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ కూలీకి అదే మట్టి ఇప్పుడు రూ.లక్షల సంపదను అందించింది. మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాల గనిలో అతడికి 11.
19 క్యారెట్ల అరుదైన వజ్రం లభించింది.రాకేశ్ గోండ్ అనే వ్యక్తి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో అహిర్గువా ప్రాంతంలో 8×8 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న గనిని లీజుకు తీసుకున్నాడు. ఆదివారం సాధారణ పనిముట్లతో మట్టిని జల్లిస్తుండగా 11.19 క్యారెట్ల నాణ్యమైన తెల్ల వజ్రం దొరికింది.వజ్రాన్ని గుర్తించిన వెంటనే రాకేశ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో దాన్ని అప్పగించాడు. అధికారులు, నిపుణులు వజ్రాన్ని పరిశీలించి దాని నాణ్యత చాలా బాగుందని తెలిపారు. రాబోయే బహిరంగ వేలంలో దీనికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాయల్టీ, పన్నులు మినహాయించిన మొత్తం రాకేశ్ కుటుంబానికి అందనుంది.గిరిజన కుటుంబానికి చెందిన రాకేశ్ ఈ డబ్బుతో అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయ భూమి కొనుగోలు చేయడంతో పాటు కొత్త ఇల్లు నిర్మించాలని భావిస్తున్నాడు. పిల్లలకు మంచి విద్య అందించడమే తమ తొలి ప్రాధాన్యమని కుటుంబ సభ్యులు తెలిపారు.వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన పన్నా జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 18న మీరా సింగ్ అనే మహిళకు 6.45 క్యారెట్ల వజ్రం లభించింది. అంతకుముందు రాకేశ్ తండ్రి, సోదరుడు కూడా 19.22 క్యారెట్ల