
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి...
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాన్ని మేనేజ్మెంట్ కావాలనే అడ్డుకుందని విమర్శిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదేనని అతడు సమర్థించాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన మీడియా సమావేశంలో వైభవ్ అంశంపై రాయుడు స్పందించాడు. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించిన సూర్యవంశీ నేరుగా మైదానంలోకి దిగడం కంటే, అంతర్జాతీయ మ్యాచ్‌ల ఒత్తిడిని అర్థం చేసుకోవడం ముఖ్యమని రాయుడు పేర్కొన్నాడు. 'టీమిండియా మేనేజ్మెంట్ సరైన నిర్ణయమే తీసుకుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం, అక్కడి వాతావరణాన్ని, వ్యూహాలను నిశితంగా గమనించడం అనేది వైభవ్‌కు నేర్చుకునే ప్రక్రియ (Learning Curve). జట్టులో సీనియర్లు, ఇదివరకు ప్రపంచకప్ గెలిచిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం న్యాయం' అని రాయుడు వెల్లడించాడు.
'ప్రస్తుతానికి వైభవ్ తన సహజ సిద్ధమైన ఆటను మార్చుకోకుండా, డగౌట్లో కూర్చుని సీనియర్ల నుంచి అనుభవాన్ని నేర్చుకోవాలి. భవిష్యత్తులో అతనికి అవకాశం వచ్చినప్పుడు మరింత అనుభవంతో బరిలోకి దిగుతాడు' అని రాయుడు విశ్లేషించాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాటే కూడా రాయుడు వ్యాఖ్యలను బలపరుస్తూ, సూర్యవంశీ ప్రతిభావంతుడే అయినప్పటికీ నూతన ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో ఒక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
అరంగేట్రానికి వైభవ్ సిద్ధంగా ఉన్నాడు.. కానీ!: భారత అసిస్టెంట్ కోచ్
వెనెజువెలా భూకంపాలు: కుటుంబాన్ని కోల్పోయిన అర్జెంటీనా ఫుట్‌బాలర్