
Pune fort murder| ఇంటర్నెట్‌డెస్క్: పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసును పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పెళ్లి షాపింగ్ కోసమంటూ కేతన్ నుంచి నిందితురాలు సియా రూ.కోటి రూపాయలు తీసుకుందని తెలుస్తోంది. తర్వాత ఆ డబ్బును ప్రియుడు చేతన్‌కు ఇచ్చిందని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. సియా-చేతన్ వేసిన ప్లాన్‌లో ఇది కూడా భాగమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
సియా-చేతన్.. కేతన్ హత్య (Ketan Agarwal Murder Case)కు ప్లాన్ చేయడమే కాకుండా భవిష్యత్ ప్రణాళికలు వేసుకున్నారట. తమ మీద ఎలాంటి అనుమానం రాకుండా చూసుకునేందుకు కేతన్‌ను అడ్డు తొలగించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్‌లో భాగంగానే కేతన్ నుంచి సియా రూ.కోటి తీసుకుంది. వివాహ ఖర్చులకు దానిని వాడుకోకుండా చేతన్‌కు ఆ డబ్బు ఇచ్చింది. తమది సంపన్న కుటుంబం కావడంతో ఆర్థికంగా స్థిరపడేందుకు కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని సియాకు చేతన్ చెప్పినట్లు సమాచారం. దీంతోనే ప్రియుడిని సెటిల్ చేసేందుకే ఆ డబ్బు ఇచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.