
విశాఖ: మసూరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలిశారు. తమ కుమార్తె మృతి, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై ఉన్న అనుమానాలను హోం మంత్రికి వివరించారు.
ఈ కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అక్కడి పోలీసులతో ఇంచార్జ్ జాయింట్ సీపీ మాట్లాడి కేసుపై వివరాలు తీసుకున్నారని వారికి హోంమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని రాధా గాయత్రి తల్లిదండ్రులకు ఆమె భరోసా ఇచ్చారు.
ఈ కేసుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని హోంమంత్రి అనిత అన్నారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడాలని రాష్ట్ర డీజీపీకి సూచించినట్లు చెప్పారు. ‘‘రాధా గాయత్రి మరణంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలి. రాధా గాయత్రి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.