
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేస్తామని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్ నుంచి బయటపడిన పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోలేదు.
ఉగ్రవాదులు బహిరంగంగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న వీడియోలు వెలుగులోకి రావడంతో, ఈ ఆధారాలతో మరోసారి పాక్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో జరగనున్న ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించి, పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని భావిస్తోంది.లష్కరే తోయిబాకు కొత్త రాజకీయ రూపంగతంలో లష్కరే తోయిబా (LeT) ఆర్థిక విభాగమైన జమాత్ ఉద్ దవా (JuD)కు స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగు తొడిగి పాకిస్థాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సరిగ్గా ఇదే కారణంతో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చిక్కుకుంది. ఇప్పుడు అదే తరహాలో మరో కొత్త ఎత్తుగడకు పాల్పడుతోంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) అనే రాజకీయ పార్టీని పాక్ ప్రోత్సహిస్తోంది. ఈ పార్టీ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదులకు రాజకీయ నాయకులనే ముద్ర వేసి, వారిని చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల సందర్భంగా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఈ కార్యక్రమానికి పీఎంఎంఎల్ ఇస్లామాబాద్ విభాగం అధ్యక్షుడు హాజరయ్యారు. అతనితో పాటు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్, మరో కీలక ఉగ్రవాది సైఫుల్లా కసౌరీ కూడా కనిపించారు. ఇలాంటి బహిరంగ కార్యక్రమాల్లో ఉగ్రవాదులు